Best Telugu Love Quotes - Love Quotes in telugu

Telugu Love Quotes 

Telugu Love Quotes: Here we are providing best love quotes in Telugu images and more, Here you can find Heart touching love quotes in Telugu and Romantic love quotes in Telugu, Telugu love quotes for him (or) her and so much love quotes here you can find them.

In this article, we are uploading List of Content about love quotes:

Love Quotes Telugu download
Love Quotes in Telugu text
Love Quotes Telugu lo 
Good Morning Love Quotes Telugu
Telugu Love Quotations
Telugu Love Quotes for him
Telugu Love Quotes for Her


1.ఈ క్షణమే తెలుసుకున్నా ప్రేమంటే ఇవ్వడమే కానీ తిరిగి ఆశించేది కాదని.    

2. భాషలు వేరైనా భావాలు ఒక్కటే..!! మనుషులు వేరైన మమతానురాగాలు ఒక్కటే. 
దారులు వేరైనా గమ్యం ఒక్కటే.!! నువ్వు నేను వేరైనా మన ప్రేమ ఒక్కటే

3. ఎలా చెప్పను ప్రియా.. !! మనం మనం ఒకరికి ఒకరమని 
ఒకరంటే ఒకరికి ప్రాణమని..!! ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని

4.ప్రేమికులకు ప్రపంచంతో పని ఉండదు. ఎందుకంటే ప్రేమే వారి ప్రపంచం.

5. అందం చూసి పుట్టే ప్రేమ. అవసరం తీరే వరకే ఉంటుంది.మనసు చూసి పుట్టే ప్రేమ. మరణం వరకు ఉంటుంది,  
నిన్ను నిన్నుగా నమ్మే వారికీ ప్రాణం ఇచ్చేయ్... నిన్ను వదిలి వెళ్లేవారికి దారినిచ్చేయ్.

6. నేను లేకుండా నువ్వు ఉండగలవేమో.. నువ్వు లేకుండా క్షణంకూడా నేను
ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వే నా ప్రాణం అయిపోయావు కాబట్టి.

7. నా మీద నీకు ఎంత ప్రేమ ఉందొ తెలీదు కానీ.. 
నాకైతే నీలాంటి మంచి వ్యక్తిని ప్రేమించినందుకు చాలా హ్యాపీ గా ఉంది

8. ఇష్టం లేని చోట ఇంద్ర భవనం కూడా ఇరుకుగానే ఉంటుంది.. మనసు పడిన చోట మట్టిల్లు కూడా తాజమహల్ లా కనిపిస్తుంది.

9. 
మనల్ని మనకంటే అధికంగా కేర్ చేసే వ్యక్తి దొరకడం మన అదృష్టం. ఆ అదృష్టాన్ని
చులకనగా తీసుకుంటే అటువంటి ప్రేమ దొరకడం చాల కష్టం.

Love Quotes in Telugu 

10. నన్ను మర్చిపోవడానికి నీకు ఇంకో కొత్త పరిచయం వస్తే చాలు. కానీ నిన్ను మరిచిపోవడానికి నాకు ఇంకో కొత్త జన్మే కావాలి.

11. ఎదలో ప్రేమ ఉంటె నిన్ను మరువగలను.
నీ ప్రేమ నా హృదయమైతే నిన్ను ఎలా మరువగలను

12. నేనేమవుతాను నీకు అంటే తెలియదంది నా మనసు .
కానీ నువ్వు నాకేమి కావంటే ఒప్పుకోనంది నా మనసు.

13. మనసాక్షి అంటూ ఉంటె ఒక్కసారి నాతో ఉన్న రోజులను గుర్తు చేసుకో.
ఒక్క చుక్క కాని కారిన చాలు నా ప్రేమ పవిత్రమైనది.

14. ఒక చక్కటి సంబంధానికి కావలసిన మూడు విషయాలు 
కన్నీరు రాని కళ్ళు .
అబద్ధాలు చెప్పని పెదాలు .
నిజమైన ప్రేమ .

15. కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిసే లోపు మరిచిపోవచ్చు కానీ 
మనసుకి నచ్చిన వారిని మరణం వరకు మరవలేరు

16. కంటి రెప్పల్లా ...అందాల చిలక...
ఎందుకే అలక...ప్రేమ మొలక...
బంగారు కులుకా...
నీ వెంటే నా నడక...కడదాకా ఉంటా...
కలకాలం తోడుంటా...ఏ కష్టం రాకుండా...ఏమనకుండా
...
కళ్ళల్లో పెట్టుకుంటా...కన్నీరు రాల్చకుండా.

17. ఆకర్షణతో వికటించి ప్రేమ ఆచరణ లో వికటిస్తుంది 
ఆలోచనతో అంకురించే ప్రేమ ఆరు కళలా పాటు నిలుస్తుంది.

18. మౌనమే నా ఆయుధంగా నీ మదిని గెలవడమే నా లక్షంగా,
ప్రతిక్షణం నే ప్రయత్నిస్తున్న...నీ మనస్సులో స్థానం దొరకదన్న..             

19. నా ప్రేమ నీ కనురెప్పలపై రాసిన ప్రేమ లేక ,
కనులు మూసినా కనులు తెరిసిన చూడలేవు కలనైనా నీ మనోనయనాలతో చూస్తావా ఈ జన్మకైనా కరుణిస్తావా ? Love Quotes Telugu

20. ఎవరి మనసులో నీవు ఉన్నవో నాకు తెలియదు కానీ..
నా మనసుకు దగ్గరైన ఒకే ఒక్క మనిషివి నీవే..

21. ప్రేమకు సంబంధించి మనుషులు సాధారణంగా రెండు పొరపాట్లు చేస్తుంటారు.. 
తమని నిర్లక్ష్యం చేసే వారిని ప్రేమించడం లేదా తమని ప్రేమించే వారిని నిర్లక్ష్యం చెయ్యడం. 

22. నువ్వు రావని తెలిసినా ...నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. 
నువ్వు నా ఎదుట లేకున్నా..నిన్ను చూస్తూనే ఉంటాను. నీకు నేను గుర్తుకు రాకపోయినా.. నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను నా హృదయాన్ని గాయ పరిచినా.. నిన్ను నా మనసులోనే కొలువుంచుతాను. నువ్వు నన్ను వీడిపోయిన.. నీ కోసం వేచివుంటాను.. నిన్నే ప్రేమిస్తాను           

23. నిన్ను ప్రేమించాకే తెలిసింది 
కనులతో కూడా మాట్లాడవచ్చని  హృదయంతో కూడా చూడవచ్చని  మౌనంలో కూడా భాష ఉంటుందని మనసుతో మనసుని చదువవచ్చని

24. నీ జ్ఞాపకాలే నా ప్రాణం .నీతోనే నా ప్రయాణం

25. ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏదిలేదు 
నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప

26. ఎవరికైనా జీవిత కాలం అంటే జనన మరణాల మధ్య కాలం 
నాకు మాత్రం నీతో గడిపిన కాలమే నా జీవిత కాలం.

27. నువ్వు ఎదురుపడ్డప్పుడల్లా నా గుండె ఎన్ని లయాలు తప్పుతుందో తెలుసా. 

28. నా హృదయం అనే పల్లకిలో నువ్వు ఏనాడో కూర్చున్నావు 
నీ హృదయ కోవెలలో నాకు చోటిస్తావా

29. ప్రియా నీవే నా ప్రాణం.. 
నీవే నా జీవం.. నీవే నా లోకం.. నీవే నా గమ్యం...నీవే నా సర్వస్వం 

Heart Touching Love Quotes in Telugu

30. ఒక మధురమైన అనుభూతి జన్మ జన్మలకు దొరకని బంధం అన్ని తానే అనిపించే అద్భుతం దాని పేరే ప్రేమ..

31. 
నువ్వు నేను అయినప్పుడు.. నేను నువ్వు అయినప్పుడు మనిద్దరం ఎలా వేరు కాగలం

32. నా ప్రియమైన నీకు ప్రేమతో చెబుతున్న. 
ప్రేమిస్తున్నాను నిన్నే... మనసారా.

33. నువ్వు నేను కలిస్తేనే మనం..

34. నీ సంతోషం నేను కాకపోయినా.. 
 నా చిరునవ్వు మాత్రం నువ్వే  
నీ ఆలోచన నేను కాకపోయినా ..
నా ప్రతి ఆలోచన నువ్వే

35. నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని పేమగా ప్రేమించు.. 
కన్నీళ్లు తుడిచే వారు ప్రేమికులు కాదు.. ఆ కన్నీళ్లు రాకుండా చూసుకునే వారే నిజమైన ప్రేమికులు.

36. దూరం చెయ్యడం నీకు తెలుసు కానీ దూరంగా ఉన్న ప్రాణంగా ప్రేమించడం నాకు తెలుసు

37. భాషలోని భావాలైతే నోటితో చెప్పగలను కానీ, 
మనసులోని ప్రేమను ఈ కనులే కదా చెప్పగలవు.

38. నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో ! 
నీతో మాట్లాడకుండా కొన్ని నిమిషాలు ఉండగలనేమో !  కానీ.!!.. 
నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను...

39. దేవుడు ప్రేమించే మనసు అందరికి ఇస్తాడు.. 
కానీ ప్రేమించే మనిషిని కొందరికే ఇస్తాడు .

Telugu quotes on love

40. చివరి క్షణం వరకు ఎదురుచూస్తా చీకటి నిండిన నా జీవితంలోకి చిరు దీపమై వస్తావని.

41. ఐన వాళ్ళు ఎందరున్నా 
ఎల్లప్పుడూ నీకై పరితపిస్తూ ఒక్కక్షణం నిన్ను విడిచి ఉండలేను ఈ నా విశాలహృదయంలో కలుపుకుంటూ వయ్యారపు నీ కన్నుల కదలిక ఒక్కోసారి నాపై నిలిపితే యుగాలు ఎన్ని గడిచిన నీ కోసం వేచి ఉంటా.

42. ప్రేమించే వారి కన్నా.. ప్రేమించ బడడం మిన్న. 

43. ప్రేమించే హృదయాన్ని ఎంత బాధపెట్టిన, అది ప్రేమించడం మరువదు 
కానీ ఆ హృదయాన్ని మోసం చేస్తే, మోసపోయిన హృదయం మళ్ళి ఎవ్వరిని ప్రేమించదు.

44. నీ వల్ల ఎవరైనా కన్నీరు పెడితే అది పాపం, నీ కోసం ఒకరు కన్నీరు పెడితే అది ప్రేమ.

45. 
ప్రేమ మనిషిని ఎంత మారుస్తుంది అంటే  ప్రేమించిన వాళ్ళు ఏదో ఒక రోజు విడిచి వెళ్ళిపోతారు అని తెలిసిన మనం ప్రేమిస్తూనే ఉంటాం 

46. నిన్ను చూడాలని తపించే కనులకు ఎలా చెప్పను, నువ్వు నాలోనే ఉన్నావని..

47. అందరూ చూపించే ప్రేమ కన్నా నువ్వు చూపించే ప్రేమ ఎంతో విలువైనది.

48. నిజంగా ప్రేమించే వారు ఎవరైనా ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కోరుకోరు, 
తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలవారినే కోరుకుంటారు

49. అందమైన శరీరాన్ని చూసి నీ మనసు నుండి వచ్చే ఆప్యాయత,ప్రేమ ఎక్కువ రోజులు నిలపడదు

50. నీ మంచి మనసుని అర్ధం చేసుకొని వచ్చే ప్రేమ ఎన్నటికీ మారదు, నీవు ఉన్నంత వరకు నిన్ను వీడదు.

51. ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే, ప్రేమించబడిన ప్రేమ ప్రేమించిన ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుంది

52. ప్రేమ అన్నది గొప్ప భావన..!! అది విరహంతో చంపేస్తుంది.. చావు నుండి బ్రతికిస్తుంది.

53. మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు 
మనల్ని వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ 


Also Visit : Telugu Life Quotes