Telugu Quotes on life in Telugu language text

Telugu Quotes on life in Telugu language text: Life quotes in Telugu text here we are providing best life quotes in Telugu text which gives the best motivation to us, These Telugu life quotes maybe change your life when you follow these quotes.

Here we providing best Life-changing quotes also visit Telugu Love QuotesTelugu Quotes on life in Telugu language text


 మనిషిలో అహం తగ్గిన రోజు..!! ఆప్యాయత అంటే అర్ధమవుతుంది.
గర్వం పోయిన రోజు..!! ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది.
నేనే .. నాకేంటి అనుకుంటే ..!! చివరికి ఒక్కడిగానే ఉంది పోవాల్సి వస్తుంది.
గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం ..


మురికిగా ఉన్నంత మాత్రాన నీరు త్రాగడానికి పనికిరాకపోవొచ్చు, కానీ మంటలను ఆర్పగలదు కదా...
అలాగే పనికిరాని బంధమని త్రుంచి పారెయ్యకండి బంధం ఎప్పుడు బంధనం అవ్వదు.


కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి, వాటితో ఎంత ప్రేమగా ఉన్నా .. ఎంత నిజాయిహతిగా ఉన్నా ఎప్పటికి వాళ్ళు మన వాళ్ళు కాలేరు.


అక్రమ సంపాదనతో చేసే విందు భోజనం కన్నా కష్టార్జితంతో తాగే గంజి నీరు ఎంతో సంతృప్తినిస్తుంది.


అధైర్యం ఆవహిస్తుందని ఏమాత్రం అనుమానం వచ్చినా సరే, ఎంతమాత్రం ఉపేక్షించకు, దాన్ని మొగ్గలోనే తుంచేయండి లేకపోతే మొదిటికే మోసం.


అన్నం లేకపోవడం కన్నా ఆప్యాయత కరువవడం అసలైన పేదరికం.


అపజయాలు తప్పులు కావు, అవి భవిషత్తు పాఠాలు.


"మనసు" కన్నా పెద్ద సమాధి మరొకటి లేదు
చెప్పాలనుకొని.. చెప్పలేని భావాలు చెప్పుకోలేని దుఃఖలు, కన్నీటిని కూడా పైకి రానివ్వని వేదన
ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు ఎందరో పాతి పెట్టేసే సమాధి.


ఒకరి కోసం నీ వ్యక్తుత్వాన్ని ఎప్పుడు మార్చుకోకు,
సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి.


కాలం మనుష్యులను మార్చదు కానీ, కాలం గడిచే కొద్దే మనుష్యుల అసలు నైజం బయటకు వస్తుంది.


పక్క వాడికి వంద సార్లు సహాయం చేసిన వాడికి అస్సలు గుర్తుండవు... కానీ !!
ఒక్కసారి కుదరదు అని చెప్పు, ఆ మాటను వాడు చచ్చిన మరిచిపోడు .. ఈ లోకం తీరే అంత మిత్రమా..


సమస్యలు ఎప్పుడైనా రానీ.. కష్టాలెప్పుడైనా రానీ.. కన్నీళ్ళెండి పొనీ ..
నీ స్నేహితులు దూరం అయిపోతే కానియ్.. రేపనేది ఒకటుంది.. నీ కోసమై వేచిచూడు నీడనేది నీదికాక ఎప్పటికి పోదు.


వేల సార్లు బాధపెట్టిన కూడా వాటన్నింటిని మరిచిపోయి తాను మాట్లాడేందుకు తపన పడే ప్రేమే నిజమైన ప్రేమ..
మీ జీవితంలో అలా ఎవరైనా ఉంటె అసలు వదులుకోవొద్దు.
అలా వదులుకుంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకెవ్వరు ఉండరు..


ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు
ఎవరైనా ఏడిస్తే మీ కోసం ఏడవాలి కానీ మీ వల్ల ఏడవకూడదు.


అన్నం లేకపోవడం పేదరికం కాదు
కుటుంభంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం.

life quotes in Telugu text


జీవితమంటే ఎదుటి వారిని సంతోషపెట్టడం కాదు
మన సంతోషాలని ఎదుటి వారితో పంచుకోవడం


మన జీవితంలో ఎప్పుడైనా సంపాదించవచ్చు, ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ !
గడిచి పోయిన కాలాన్ని మాత్రం తీసుకురాలేము. అందుకే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆశ్వధించండి.. మీ సంతోషాలను వాయిదా వెయ్యకండి.


కానీ వాళ్ళు మోసం చేస్తే క్షమించాలనిపిస్తుంది కానీ,
కావలసిన వాళ్ళు మోసం చేస్తే చంపెయ్యాలనిపిస్తుంది లేదా చచ్చిపోవాలనిపిస్తుంచి.


మనకు నచ్చినా, నచ్చకపోయిన ఇక్కడ బ్రతికి ఉన్నంత కాలం బాధ మన జీవితంలో ఒక భాగం.

మనం బాగుండాలి అని కోరుకునే వాడు ఎప్పుడు కోపంగానే మాట్లాడుతాడు.


ద్వేషించే ముందు కాస్త ఆలోచించండి ఎందుకంటే ఇష్టంలో పెరగడం తరగడం రెండు ఉంటాయి కానీ,
ద్వేషం పెరగడమే తప్ప తరగడం అంటూ ఉండదు.


నీకు బాగా దగ్గర ఎవరో తెలుసా..??
నీకు ఎవరిని కలిసినప్పుడు ఆనందం కలుగుతుందో వారు కాదు
ఎవరిని కోల్పోయినప్పుడు బాధ కలుగుతుందో వారే నీకు దగ్గర వారు.


జీవితంలో మనం ఎవరిని కలువాలనేది కాలం నిర్ణయిస్తుంది
మనకు ఎవరు కావాలనేది మన హృదయం నిర్ణయిస్తుంది.. కానీ!!
మనతో ఎవరు ఉంటున్నారనేది కేవలం మన ప్రవర్తన మాత్రమే నిర్ణయిస్తుంది.


నేను మాత్రం బాగుండాలి అనుకోవడం స్వార్ధం
నేను కూడా బాగుండాలి అని కోరుకోవడం సహజం
నేను బాగుండాలి!! నా వల్ల పది మంది బాగుండాలి అనుకోవడం అద్భుతం.


జీవితంలో ఎదురయ్యే అనేక దుఃఖలకు కారణం అనుకున్న లక్షాలను సాధించలేకపోవడం కాదు
అసలు ఏ లక్షం లేకపోవడం.

Telugu quotations in Telugu language 


కొందరు నవ్వుతు నవ్విస్తారు
కొందరు ఏడుస్తూ నవ్విస్తారు


ఒకరి మెప్పు కోసం నటించడం మొదలుపెడితే
నీ కోసం నీవు జీవించడం మరిచిపోయినట్లే.


జీవితంలో ఎప్పుడు అనుకోని సమస్యలే ఎదురవుతూ ఉంటాయి
వాటిని ఎలా ఎదురుకోవాలో తెలుసుకోవడమే జీవితం
దీనిలో గెలవడాలు ఓడిపోవడాలు ఉండవు, పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి.

తిన్నది కడుపునా ఉండిపోదు.. !
కానీ అన్నది మనసున ఉండిపోతుంది, అందుకే తొందరపడి నోరు జారకూడదు.


కొన్నిసార్లు చాలా సాధారణమైన సంఘటన కూడా మన జీవితాలపై ఎనలేని ప్రభావం చూపిస్తుంది
అది విలువైన పాఠంగా మారుతుంది.


నింద నిజమైతే తప్పక దిద్దుకో
అబద్దమైతే నవ్వేసి ఊరుకో


కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు.


ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే
బంధువులు స్నేహితులు ఎవ్వరు మిగలరు


జీవితంలో మూడు విషయాలను ఎప్పటికి తిరిగి పొందలేము
చేజార్చుకున్న అవకాశం, జరిగిపోయిన కాలం, నోటి నుండి వెలువడిన మాట


లోకంలో ఉన్న చీకటంత ఒక్కటైన అగ్గిపుల్ల వెలుగును దాచలేదు
నీ లక్షానికి ఆత్మవిశ్వసం తోడైతే నీ విజయాన్ని ఎవ్వరు ఆపలేరు.


నిన్ను భూమి మీద తేవడానికి మీ అమ్మే అంత కష్టపడింది
నీ జీవితంలో ఎదగడానికి కష్టాలను చూసి బయపడకు


పొగిడే వాడు నీ పక్కన ఉంటె నువ్వు గెలిచినట్టు కాదు
తిట్టే వాడు నీ పక్కన ఉంటే నువ్వు ఊడినట్టు కాదు


ప్రతి హృదయంలో బాధ ఉంటుంది కానీ, చూపించే విధానం వేరుగా ఉంటుంది
అవివేకి కళ్ళలో దాచిపెడితే, వివేకి నవ్వులో దాచిపెడుతాడు.


మీరంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పుడు అశ్రద్ధ చెయ్యకండి
ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది, ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్లకై వెతుకుతున్నారని


బయపడి చెవులు మూసుకుంటే, గెలుపుకొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది.