Home Top Ad

How To Create YouTube Channel In Telugu ( యూట్యూబ్ ఛానల్ ని ఎలా క్రియేట్ చెయ్యాలి.)

Share:

How To Create YouTube Channel In Telugu : YouTube ! ఈ పదం తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఈ వెబ్సైటు మన మనసులో అంతగణం నాటుకుపోయింది. మనకు ఎటువంటి సందేహం ఉన్న మనం మొదటగా Google లో వెతకడం జరుగుతుంది, మనం మన సందేహాన్ని ఒక Video రూపంలో పొందాలి అని అనుకున్నప్పుడు YouTube లో వెతకడం లేదా Search చెయ్యడం జరుగుంది.

ఈ YouTube అనే వెబ్సైటు గూగుల్ కి సంబంధించిన Website అని అందరికి తెలిసిన విషయమే, ప్రపంచంలో మొదటి Search Engine Google మరియు రెండవ Search Engine YouTube అని మీ అందరికి తెలిసే ఉంటుంది, ఈ రెండు Google మరియు YouTube లు అమెరికా దేశానికి సంబంధించిన కంపెనీలు.

ఈ రోజుల్లో YouTube ని కెరీర్ గా తీస్కొని చాలా మంది Students మరియు ఇతరులు రాత్రింబగళ్లు కష్టపడుతూ ఉన్నారు, ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా వాళ్లకు లభించింది, ఈ YouTube ని కెరీర్ గా తీస్కొని డబ్బులు మరియు Fame సంపాదించిన వాళ్ళు ఉన్నారు, YouTube లో Success రాక YouTube ని వదులుకున్న వారు కూడా ఉన్నారు.

Create YouTube Channel In Telugu

Step By Step Process To Create YouTube Channel In Telugu ( YouTube ఛానల్ క్రియేట్ చెయ్యడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ )

YouTube ఛానల్ క్రియేట్ చేసే ప్రాసెస్ మొబైల్ లోను కంప్యూటర్ లోను ఒకే విధంగా ఉంటుంది, కాబట్టి మీరు మొబైల్ లో కూడా ఇదే ప్రాసెస్ అనుసరించండి.

YouTube ఛానల్ క్రియేట్ చెయ్యడానికి మనకు కావలసినవి.

  1. Gmail ID ( Gmail అకౌంట్ )
  2. ఫోన్ నెంబర్ 

మనకు Gmail అకౌంట్ ఖచ్చితంగా ఉంది తీరాలి ఎందుకంటే Gmail ID లేకుండా మనం YouTube లోకి Sign In అవ్వలేము కాబట్టి మీరు మొదటగా Gmail ID ని క్రియేట్ చేసుకోండి.

మనకు ఫోన్ నెంబర్ కూడా కావలి ఎందుకంటే మనం ఛానల్ ని క్రియేట్ చేసాక Verify చెయ్యలి  కాబట్టి మనకు Running ఫోన్ నెంబర్ కూడా ఉండాలి.

STEP 1

మనం YouTube  ఛానల్ క్రియేట్ చెయ్యాలంటే మొదటగా మన Mobile లో గాని Desktop లో గాని మీకు నచ్చిన Browser ని Open చెయ్యండి, నేను Chrome Browser ని Use చేస్తాను కాబట్టి Chrome Browser లోనే చూపించడం జరుగుతుంది.

brower-search-bar

Browser ని Open చేసాక Search Bar లో www.youtube.com అని టైపు చెయ్యండి, చేసాక Enter బటన్ ని నొక్కండి అప్పుడు మీకు YouTube website ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

STEP 2

YouTube వెబ్సైటు Open అయ్యాక మీకు కింద కనిపించే Picture లాగా కనిపించడం జరుగుతుంది.

Youtube Signin

పైన చూపించిన బొమ్మ చూసినట్లయితే Top లో Right Side మనకు Sign In అనే Option కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు దాని మీద Click చెయ్యండి, Click  చేసినట్లు అయితే తర్వాత మీకు కింద చూపించిన Picture లాగా Google లోకి Sign In అవ్వడానికి మీ యొక్క Email ID ని అందులో Enter చేసి Next అనే Option మీద క్లిక్ చెయ్యండి.

Signin

Next Option మీద click చేసిన వెంటనే మీకు Password పేజీ అనేది Open అవ్వడం జరుగుతుంది, అది కింద ఇచ్చిన Picture లాగా ఉంటుంది, అందులో మీరు మీ యొక్క Gmail Password ని Type చెయ్యండి, Type చేసి Next ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లు అయితే మీకు యూట్యూబ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Password

STEP 3

YouTube లోకి Sign In అయ్యాక మీకు Top లో Right Side మీకు మీ ఛానల్ యొక్క Default లోగో కనిపించడం జరుగుతుంది, దాని మీద క్లిక్ చేసినట్లు అయితే మీకు కింద కనిపించే బొమ్మలాగా కొన్ని Options రావడం జరుగుతుంది.

Settings

పైన చూపిన Picture లో Settings అనే ఆప్షన్ ఉంటుంది, మీరు ఆ Option పైన క్లిక్ చెయ్యాల్సి ఉంటుంది, Settings Option మీద క్లిక్ చేసిన వెంటనే ఇంకొక Screen Open అవుతుంది, అది అచ్చం చూడడానికి కింద ఇచ్చిన Picture లాగే ఉంటుంది.

add or remove

ఇప్పుడు మీరు Add or Manage Your Channel(s) అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి , ఇలా చెయ్యడం వాళ్ళ మీకు ఎన్ని చానెల్స్ ఉంటె అన్ని ఛానల్ యొక్క పేరు ఇక్కడ కనపడడం జరుగుతుంది, కింద కనిపించే విధంగా.

ఇప్పుడు మీరు Create a New Channel అనే Option మీద Click చెయ్యండి, ఇలా క్లిక్ చేసిన వెంటనే మీరు ఇంకో పేజీ కి Redirect అవ్వడం జరుగుతుంది, ఆ page కింద ఇచ్చిన Picture లాగ ఉంటుంది.

ఇప్పుడు మీరు మీ ఛానల్ కి ఏమి పేరు పెట్టాలి అని అనుకుంటున్నారో, ఆ పేరు అందులో Type చెయ్యండి. నేను ఉదాహరణకు Sample Channel అనే పేరు మీద ఛానల్ క్రియేట్ చెయ్యడం జరుగుతుంది.

పైన చెప్పిన విధంగా మీరు మీ యొక్క ఛానల్ పేరు అందులో Type చేసి Create అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లు అయితే మీకు మీ ఛానల్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. మీ ఛానల్ Create అయ్యాక మీరు మీ ఛానల్ కి Redirect అవ్వడం జరుగుతుంది.

STEP 4 ( మీ ఫోన్ నెంబర్ ని VERIFY చెయ్యాలి )

మీరు మీ ఫోన్ నెంబర్ ని తప్పని సరిగా VERIFY చేస్కోండి, ఇలా చేసుకోవడం వాళ్ళ మనకు 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉన్న వీడియోస్ ని కూడా Upload చేస్కునే అవకాశం ఉంటుంది, అలాగే Custom Thumbnails పెట్టుకునే అవకాశం ఉంటుంది.

ఒక వేళా మీరు మీ మొబైల్ నెంబర్ ని Verify చేసుకోకపోతే మీకు పైన చెప్పిన options రావు, కాబట్టి మీరు తప్పనిసరిగా ఫోన్ నెంబర్ ని Verify చేస్కోండి.

మీరు మీ ఫోన్ నెంబర్ ని Verify చేసుకోవడానికి మీ ఛానల్ ఓపెన్ అయ్యాక Top లో Right Side లోగో మీద క్లిక్ చేసినట్లు అయితే Settings option కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చెయ్యండి.

Settings Option మీద క్లిక్ చేసాక మీకు కింద కనిపించే Picture లాగ ఒక కొత్త Window ఓపెన్ అవుతుంది, 


 ఇప్పుడు మీకు పైన చుపిచ్చిన విధంగా ఒక Screen కనిపిస్తుంది, ఇప్పుడు మీరు Channel Status and Features అనే option మీద క్లిక్ చెయ్యాలి, ఇలా క్లిక్  చేసినట్లయితే మీకు YouTube Studio Open అవ్వడం జరుగుతుంది.

ఇప్పుడు మీకు పైన ఇచ్చిన Picture లో ఉన్నట్లు Verify Phone Number అనే Option ఉంటుంది, ఇప్పుడు మీరు దాని మీద క్లిక్ చెయ్యండి, ఇలా క్లిక్ చేసినట్లు అయితే మీకు కింద కనిపించే విధంగా ఇంకొక స్క్రీన్ కనిపిస్తుంది.

ఇప్పుడు మీరు Country ని సెలెక్ట్ చేసుకొని Text Me The Verification Code అనే ఆప్షన్ మీద క్లిక్  చేసి మీ మొబైల్ నెంబర్ ని అందులో Type చెయ్యండి, అందులో Type చేసాక Submit Button మీద క్లిక్ చెయ్యండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి ఒక OTP ( One Time Password ) వస్తుంది. 

మీకు  వచ్చిన OTP ని పైన కనిపించే Box లో Type చేసి Submit Button మీద క్లిక్ చేస్తే మీ YouTube Channel Verify అవుతుంది. మీ ఛానల్ Verify అయ్యాక కింద కనిపించే Picture లో లాగ కనిపించడం జరుగుతుంది.

ఇప్పుడు మీ YouTube ఛానల్ verify అయినట్టు Display అవుతుంది, ఇప్పుడు మీరు మీ ఛానల్ లో వీడియోస్ ని అప్లోడ్ చేస్కోవచ్చు.

ఈ విధంగా మీరు మీ యొక్క YouTube Channel Create చేస్కోవచ్చు, ఈ  Post నచ్చినట్లైతే మా YouTube ఛానల్ ని Subscribe చెయ్యండి, మీరు ఈ పోస్ట్ ను  share చెయ్యండి.

No comments