Home Top Ad

Patammathone Pranam Naku Song Lyrics ☑ » in Telugu

Share:

Patammathone Pranam Song Lyrics » పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మర పాట ఎంత బాగా హిట్ అయిందో మన అందరికి తెలిసిన విషయమే, ఈ పాట ఈ విధంగా హిట్ అవ్వడానికి కారణం, ఆ పాట యొక్క Lyrics వల్ల అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Patammathone Pranam Naku Song Lyrics

Patammathone Pranam Song Cast & Full Details 

Patammathone Pranam Naaku Chaduvulammara పాటను రాసింది యసారపు రాంబాబు, ఈ పాటను పాడింది కూడా యసారపు రాంబాబు, ఈ పాటను Produce చేసింది రేలారే రేలా గంగా మరియు ఈ పాటకు దర్శకత్వం ( Music Director ) వహించింది కళ్యాణ్ కీస్.

గానం & లిరిక్స్  » రాంబాబు యాసారపు
సంగీతం » కళ్యాణ్ కీస్
మిక్సింగ్ » బాలకృష్ణ
ఫ్లూట్ » శ్రీనివాస్
కెమెరా » శివ వేల్పుల
నిర్మాత » గంగా (సాహితి), సుదర్శన్ పెరంబుదూర్
ఆడియో » రేలారే గంగా సాంగ్స్

Patammathone Pranam Naku Chaduvulammara Song Lyrics in Telugu

పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా..
పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా…

అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా..

వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కను దారను నేను రా..

ఉన్నా రెండు ఎకరాలను కళ్ళ సూడలే..
మా నాన్న నాగలి కర్రు పెట్టి.. పొలమూ దున్నలే.. ||2||

కట్నం కింద అంతా అక్కకు రాసిచ్చినం… ||2||
మా అక్కను బావ కొడితే ఎక్కీ ఎక్కీ ఏడ్చినం..

చెప్పేటోడు లేక పది ఫెయిలయిపోయినా… ||2||
సదువమ్మా విలువ తెలిసీ… ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా..

పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా..
పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా…

అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా…
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా..

సిరిగిన అంగీ లాగులేసుకొని.. బాల్యమంత గడిపినా..
బత్త సంచిల బుక్కులేసుకొని.. బడికి రోజు నేను పోయినా…. ||2||

అమ్మ నాన్న వాళ్ళ నెత్తురిని..
సత్తువగా జల్లే నన్ను సాదిండ్రు..
రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల భాధను..
గుండెల్లో దాసుకుండ్రు…

ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను..ఓ.. నాన్నా….. ||2||
ఈ భాదలు బందయ్యె రోజు తెస్తనే… జన్మనిచ్చిన అమ్మా..

పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా.
పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా

అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా.

కళ్ళకు జారిన కన్నీళ్ళతో పాటలెన్నో రాస్తా.. ||2||

మహనీయుల త్యాగాల దారిలో.. నా గొంతును వినిపిస్తా.
అక్షరాల ఉక్కు పిడికిళ్ళకు.. ఊపిరి పాటౌతా.. ||2||

చీకటి బతుకుల్లో వెలుగుల్ల రాగమై.. దారులు నేనేస్తా
జ్ఞానం కోసం ధ్యానం చేసిన.. శంభూకునౌతా

సదువమ్మ బాటలో పాటను నేనై
స్వేరో జెండాను గుండెకత్తుకుంటా

పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా.
పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా

అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా

Watch Patammathone Pranam Naku Full Video Song

Conclusion » Patammathone Pranam Song Lyrics మీకు నచ్చినట్లైతే ఈ లిరిక్స్ ని మీ మిత్రులతో పంచుకోండి దానికోసం మీరు కింద కనిపించే Share Buttons మీద Click చేసి అందరికి చెయ్యాలని కోరుకుంటున్నాను.

No comments